News April 8, 2025
కొత్తపల్లి: హత్య కేసులో నేరస్థుడికి జైలు శిక్ష

హత్యకేసులో నిందితుడికి యావజ్జీవజైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పుఇచ్చిందని ఎస్పీ యోగేశ్‌గౌతమ్ తెలిపారు. ఆయన వివరాలు.. వింజమూరుకు చెందిన జోగువెంకట్ రాములు కొత్తపల్లి మం. తిమ్మారెడ్డిపల్లికి చెందిన కృష్ణవేణిని అత్యాచారం విఫలయత్నంచేసి నిప్పంటించి హత్యచేశాడు. ఈకేసులో ముద్దాయికి సోమవారం జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ శిక్ష విధించారు. 2022 ఫిబ్రవరి 15న బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.
Similar News
News July 6, 2025
పొతంగల్: అబార్షన్ అయ్యిందని వివాహిత ఆత్మహత్య

అబార్షన్ అయ్యిందని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పొతంగల్ మండలం కొడిచర్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొడిచర్ల సుధాకర్‌తో మహాదేవి(28)కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె ఇటీవల గర్భం దాల్చగా పిండం సరిగా లేక అబార్షన్ అయ్యంది. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News July 6, 2025
పన్ను వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: మేయర్, కమిషనర్

గ్రేటర్ వరంగల్ పరిధిలో పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పేయ్ అన్నారు. బల్దియా కాన్ఫరెన్స్ హాల్లో శనివారం పన్ను వసూళ్లపై సమీక్షా సమావేశం జరిగింది. బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో నిర్వహించిన ఈ సమావేశంలో పన్ను వసూళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు వారు అధికారులకు సూచనలు చేశారు.
News July 6, 2025
వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రామాంజి నేయులు

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గుంతకల్లుకు చెందిన జింకల రామాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ సీఎం జగన్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డికి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని వెంకటరామిరెడ్డి ఆయనకు సూచించారు.