News March 21, 2024

కొత్తపేటలో జగ్గిరెడ్డి హ్యాట్రిక్ కొడతారా?

image

కొత్తపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా బరిలో చిర్ల జగ్గిరెడ్డి ప్రస్తుతం ఐదోసారి పోటీలో ఉన్నారు.2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన 2009లో ఓటమి చెందారు. 2014, 2019లో వైసీపీ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించారు. పోటీ చేసిన నాలుగు సార్లు, ప్రస్తుతం కూడా ఆయన ప్రత్యర్థి బండారు సత్యానందరావు కావడం విశేషం. మరి జగ్గిరెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారా? కామెంట్ చేయండి.

Similar News

News February 22, 2026

అనూరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దుర్గేశ్

image

తూ.గో. జిల్లాలో అనూరియా(మూత్రపిండాల వ్యాధి) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ అధికారులు, వైద్య వర్గాలతో కలిసి తాజా పరిస్థితులను ఆదివారం ఫోన్ ద్వారా సమీక్షించినట్లు ఆయన తెలిపారు. అనూరియా వ్యాప్తి నివారణ కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.

News February 22, 2026

రాజమండ్రి: అనూరియా కేసులపై ఎంపీ పురందేశ్వరి సమీక్ష

image

రాజమండ్రిలో నమోదైన అనూరియా కేసులపై ఎంపీ పురంధరేశ్వరి ఆదివారం కలెక్టర్ కీర్తి చేకూరి, డీఎంహెచ్వోలతో ఫోన్‌లో సమీక్షించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆమె, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కల్తీ అనుమానాల నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు నిర్వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యం విషయంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు.

News February 22, 2026

రాజమండ్రి: అనూరియా కేసులపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

image

తూ.గో. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు రాజమండ్రిలో అనూరియా కేసుల క్లస్టర్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కే.వెంకటేశ్వరరావు వివరాలు ప్రకారం రాజమండ్రికి చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించి విచారణ ప్రారంభించామన్నారు.