News June 20, 2024

కొత్తపేటలో జాబ్ మేళా

image

కొత్తపేట విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.పెద్దిరాజు తెలిపారు. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఐటెక్ సాఫ్ట్వేర్ తదితర కంపెనీలు పాల్గొంటాయన్నారు. మొత్తం ఖాళీలు 316 ఉన్నాయన్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 3, 2025

శివాలయాలు, ఘాట్ల వద్ద పోలీసు బందోబస్తు పెంపు: ఎస్పీ

image

కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలు, ఇతర ఆలయాల వద్ద, ఘాట్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నర్సింగ్ కిషోర్ సోమవారం తెలిపారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని, భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలలో భద్రత దృష్ట్యా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భక్తులు భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు.

News November 3, 2025

మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు

image

బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా అధిష్ఠానం ఆయనను నియమించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా మండలిలోకి వచ్చిన వీర్రాజు ఇకపై పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో, ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ కీలకపదవిని కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.