News December 21, 2024

కొత్తవలసలో సెప్టిక్ ట్యాంకులో పడి చిన్నారి మృతి

image

అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం కొత్తవలసలోని కంటకాపల్లిలో జరిగింది. స్థానికుల కథనం.. ఊళ్లో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. ఆ సమయంలో దశ్వంత్ అటుగా వెళ్తూ గుంతలో పడిపోయాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంత నీటితో నిండి ఉంది. ఎవ్వరూ గమనించక పోవడంతో మృతి చెంది సాయంత్రానికి తేలాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Similar News

News February 24, 2026

VZM: మార్చి 8న గురుకుల పాఠశాల్లో ప్రవేశ పరీక్ష

image

విద్యా సంవత్సరంలో ఏపీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 6-10వ తరగతులకు మార్చి 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విజయనగరం జిల్లా కోఆర్డినేటర్‌ ఎం.మాణిక్యం తెలిపారు. 5వ తరగతి ఇంటర్ ప్రవేశ పరీక్ష యధావిధిగా మార్చి1న జరుగుతుందన్నారు. సమ్మేటివ్ అసెస్మెంట్‌టు పరీక్షలు ఉన్న కారణంగా 6, 7, 8, 9, 10వ తరగతులకు మార్చి 2న జరగాల్సిన పరీక్ష వాయిదా వేసినట్లు ప్రకటించారు.

News February 24, 2026

భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, తదితర పనుల పురోగతిని సమీక్షించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రహదారి, కాలువలు, ఎస్టీపీలు, ఒబేరాయ్ హోటల్‌కు సంబంధించిన భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలన్నారు.

News February 24, 2026

చీపురుపల్లిలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

సీఎం చంద్రబాబు ఈనెల 28న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం 28న ఉదయం 11 గంటలకు చీపురుపల్లి మండలం రావివలసకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. 11.20 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావేదిక మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 1.40 నుంచి 2.25 వరకూ పైలపేటలోని లబ్ధిదారులను కలుస్తారు. 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రావివలసలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుపయనమౌతారు.