News June 16, 2024

కొత్తవలస: రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని రైల్వే ఎస్.ఐ రవివర్మ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయనకు వచ్చిన సమాచారం మేరకు కొత్తవలస మండలం నిమ్మలపాలెం వద్ద రైల్వే బ్రిడ్జి కింద గుర్తు తెలియని మృతదేహన్ని పరిశీలించామన్నారు. రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెంది ఉండవచ్చు అన్నారు. మృతదేహం పక్కన తాపీలు ఉన్నాయని, వ్యక్తి సమాచారం తెలిసిన వాళ్లు జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

Similar News

News September 21, 2024

VZM: ‘ఈనెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నాం’

image

ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. ఈ మేరకు విజయనగరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ను శుక్రవారం తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమ్మె నోటీసు అందజేశారు. తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

News September 20, 2024

VZM: గురజాడ జయంతికి సర్వం సిద్ధం

image

విజయనగరంలో శనివారం నిర్వహించనున్న మహా కవి శ్రీ గురజాడ అప్పారావు జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. గురజాడ స్వగృహంతో పాటు ఆయన విగ్రహం వద్ద విద్యుత్ దీపాల అలంకరణను అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో గురజాడ నివాసం విద్యుత్ అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. కలెక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

News September 20, 2024

విశాఖ-దుర్గ్ వందే‌భారత్ ఛార్జీలు ఇవే

image

కొత్తగా ప్రారంభమైన విశాఖ-దుర్గ్ వందే భారత్ రైలు ఛార్జీలు గుండె గుబేల్ మంటున్నాయి. శుక్రవారం నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతోంది. విజయనగరం నుంచి రాయగడ ఛైర్ కార్ ధర రూ.535, పార్వతీపురానికి రూ.490గా ధర ఉంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్ ధర అయితే దీనికి రెట్టింపు ఉంది. ఇదే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ స్లీపర్ క్లాస్ విజయనగరం నుంచి పార్వతీపురం ధర కేవలం రూ.145 మాత్రమే. వందే భారత్ ధరలు చూసి ప్రయాణీకులు హడలిపోతున్నారు.