News April 4, 2025

కొత్తవలస: హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడి నూకరాజుకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం తెలిపారు. నిందితుడు తన భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడన్నారు. తిరిగి భార్య కనిపించలేదని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.

Similar News

News April 13, 2025

వైసీపీ పీఏసీ మెంబెర్‌గా మాజీ ఎంపీ బెల్లాన

image

మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌కు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. బెల్లానను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ( PAC) మెంబర్‌గా నియమిస్తూ తాడేపల్లి పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్.జగన్ ఆదేశాల మేరకు 17 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ జాబితాను విడుదల చేసింది.

News April 13, 2025

VZM: ‘నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర ఎనలేనిది’

image

ప్రజల భద్రత, నేరాల నియంత్రణలోను, శాంతిభద్రత పరిరక్షణలోను సీసీ కెమెరాల పాత్ర ఎనలేనిదని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ప్రజల భద్రతలో సీసీ కెమెరాల పాత్రను గుర్తించి, వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. జిల్లాలో నూతనంగా 3000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా చేసుకొని, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా స్థానికుల సహకారంతో 2125 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసామన్నారు.

News April 12, 2025

ఇంటర్ రిజల్ట్స్.. 12 వ స్థానంలో విజయనగరం జిల్లా

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో విజయనగరం జిల్లాలో 17,636 మందికి 11,525 మంది పాసయ్యారు. 65 శాతం పాస్ పర్సంటేజీతో ఫస్ట్ ఇయర్‌లో రాష్ట్రంలో 12వ స్థానంలో జిల్లా నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 15,512 మంది పరీక్షలు రాయగా 12,340 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలో విజయనగరం జిల్లా 15వ స్థానంలో నిలిచింది.

error: Content is protected !!