News March 20, 2024

కొత్తూరు: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం విషాదకర ఘటన వెలుగుచూసింది. కొత్తూరు మం. గూడూరులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందారు. ఉదయం పశువులను మేపడానికి వెళ్లిన స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు కిష్టయ్య, వెంకటేశ్‌గా గుర్తించారు.

Similar News

News September 14, 2024

MBNR: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇదే..

image

మహబూబ్‌నగర్ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. చిన్నచింతకుంట మండలం ధమాగ్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12:15కి దమాగ్నాపూర్ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం మ. 1గంటకు తిరిగి హైదరాబాద్ వెళ్లారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎస్పీ జానకి పర్యవేక్షిస్తున్నారు.

News September 14, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా మాగనూరులో 32.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా జాలాపూర్ 31.5 డిగ్రీలు, వనపర్తి జిల్లా వీపంగండ్లలో 30.7 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా సిరివెంకటపూర్ లో 30.3 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా వాత్త్వర్లపల్లిలో 28.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతల నమోదు అయ్యాయి.

News September 14, 2024

లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్

image

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం తిమ్మాజీపేట మండలం ఆవంచలోని లక్ష్మారెడ్డి ఇంటికి చేరుకొని శ్వేతా రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా BRS మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.