News January 31, 2025

కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి.. ఈ విషయం తెలుసా?

image

నంద్యాల (D) కొత్తూరులో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి. కోరిన కోర్కెలు తీర్చే ఈ స్వామి దర్శనం సర్వశుభదాయకంగా భక్తులు భావిస్తారు. ఇంటి దైవంగా కొలుస్తూ తమ సంతతికి స్వామి పేరు వచ్చేలా పెట్టుకుంటారు. పురుషులకైతే సుబ్రహ్మణ్యం, సుబ్బరాయుడు, సుబ్బయ్య, సుబ్బు, మహిళలైతే సుబ్బమ్మ, సుబ్బరత్నమ్మ తదితర పేర్లు పెట్టుకుంటారు. జిల్లాలోని పత్రి గ్రామంలో ఇలాంటి పేర్లు పదుల సంఖ్యలో కనిపిస్తాయి.

Similar News

News February 28, 2026

నేడు కాళోజీ కళాక్షేత్రంలో అంతరిక్ష ప్రయోగాలపై సెమినార్

image

అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం మ.2:30 నుంచి 4 వరకు HNK కాళోజీ కళాక్షేత్రంలో సెమినార్ నిర్వహించనున్నారు. అంతరిక్ష ప్రయోగాలపై ప్రముఖ వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం భద్రకాళి బండ్ వద్ద రుద్రమ రాకెట్‌ను ఆవిష్కరించనున్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

News February 28, 2026

రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేత: జగ్గారెడ్డి

image

దేశం కోసం రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా విలువైన సూచనలు ఇస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ఇచ్చే సలహాలను ప్రధాని మోదీ వింటున్నారే తప్ప, అమలు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

News February 28, 2026

ఆదిలాబాద్: రోబోటిక్స్ కోర్సు దరఖాస్తుకు నేడే ఆఖరు

image

ఆదిలాబాద్‌‌ పట్టణంలోని ATC కేంద్రంలో PMKVY 4.0 కింద ‘ఆటోమోటివ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీర్’ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. మూడు నెలల కాలపరిమితి గల ఈ స్వల్పకాలిక శిక్షణ ద్వారా అభ్యర్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించవచ్చన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 28 సాయంత్రం 5 గంటల లోపు కళాశాలలో సంప్రదించాలన్నారు.