News January 4, 2025
కొత్త ఆవిష్కరణలకు మూలం పరిశోధనలే: తిరుపతి కలెక్టర్
నూతన ఆవిష్కరణల కోసం పరిశోధనలు ఆవశ్యకమని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్‌పిబిఎస్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో శుక్రవారం జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలన్నారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు రేకెత్తించేలా టీచర్లు ప్రేరేపించాలని ఆయన కోరారు.
Similar News
News January 25, 2025
రంగంపేట క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడి స్పాట్ డెడ్
గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన రంగంపేట క్రాస్ వద్ద చోటుచేసుకుంది. తేనేపల్లి పంచాయతీ బీదరామిట్టకు చెందిన నవీన్ అనే యువకుడు రంగంపేట క్రాస్ గువ్వల కాలనీ సమీపంలో నడుచుకుని వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
News January 24, 2025
చిత్తూరులో చీటింగ్ కేసు నమోదు
2000 వ సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వ టెండరు దక్కించుకొని సక్రమంగా పంపిణీ చేయని చర్చి వీధికి చెందిన శ్రీ షిరిడి సాయి ఎంటర్ప్రైజెస్ అధినేత కామేశ్వరరావుపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేస్తామని సీఐ జయరామయ్య తెలిపారు. 25 ఏళ్లుగా కేసు నడుస్తున్నప్పటికీ వాయిదాకు గైర్హాజరు కావడంతో నేడు దండోరా వేశామన్నారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
News January 24, 2025
తిరుమలలో పలు సేవలు రద్దు
రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఫిబ్రవరి 4వ తేదీన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. NRIలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.