News March 25, 2025

కొత్త క్యాబినెట్.. వరంగల్‌కు దక్కని అవకాశం!

image

మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈసారి ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ అంశంపై ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే సీతక్క, సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు. కాగా WGL జిల్లాకు చెందిన MLA, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తనకు మంత్రి పదవి కావాలని పార్టీ పెద్దలను పలుమార్లు కలిశారు. కానీ ఆయన పేరు కూడా లిస్టులో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నట్లు తెలిసింది.

Similar News

News December 3, 2025

ఎచ్చెర్ల: మహిళ హత్య?

image

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలన జరుపుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 3, 2025

పాలమూరు: రెబల్ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ కోసం పడరాని పాట్లు

image

పాలమూరు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెబల్ అభ్యర్థుల ఉపసంహరణ కోసం వివిధ పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు బరిలో నిలవడంతో, ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపసంహరణకు నేడే చివరి రోజు కావడంతో, రెబల్ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం.

News December 3, 2025

వరుసగా రెండో రోజూ పతనం.. 90 దాటిన రూపాయి

image

భారత రూపాయి వరుసగా రెండో రోజూ పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.13కు చేరింది. మంగళవారం అత్యంత కనిష్ఠంగా 89.94 వద్దకు చేరిన రూపాయి నేడు మరింత బలహీనపడింది. 2025లో ఇప్పటివరకు 5 శాతానికిపైగా పతనమైంది. USతో ట్రేడ్‌డీల్‌పై అనిశ్చితి, ఈక్విటీల్లోంచి విదేశీ నిధుల ఉపసంహరణ, బంగారం సహా దిగుమతులకు డిమాండ్, ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ చేస్తుండటం రూపాయిపై ఒత్తిడి పెంచుతోందని విశ్లేషకులు తెలిపారు.