News March 25, 2025
కొత్త క్యాబినెట్.. వరంగల్‌కు దక్కని అవకాశం!

మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈసారి ఛాన్స్ దక్కలేదని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ అంశంపై ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే సీతక్క, సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు. కాగా WGL జిల్లాకు చెందిన MLA, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తనకు మంత్రి పదవి కావాలని పార్టీ పెద్దలను పలుమార్లు కలిశారు. కానీ ఆయన పేరు కూడా లిస్టులో లేకపోవడంతో ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నట్లు తెలిసింది.
Similar News
News April 18, 2025
అంబేడ్కర్ కోనసీమలో ప్రజలకు విద్యుత్ కష్టాలు

కోటిపల్లి వద్ద విద్యుత్ టవర్ కూలిపోవడంతో కోనసీమ ప్రజలకు శాపంగా మారింది. దాంతో ప్రజలు కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజుల నుంచి సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. రాత్రి సమయంలో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమలు చేయడంతో అంబేడ్కర్ కోనసీమలో విద్యుత్ కోత వల్ల ప్రజలు చిమ్మచీకటిలో కాలం వెల్లుబుచ్చుతున్నారు. విద్యుత్ సరఫరా లేని కారణంగా దోమల మోతతో నిద్రకు దూరమయ్యారు.
News April 18, 2025
రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

రైలు నుంచి జారిపడి విజయనగరం జిల్లా వాసి మృతిచెందాడు. తుని జీఆర్పీ ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం..అన్నవరం-హంసవరం రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి అప్పారావు(55) మృతి చెందాడు. దర్యాప్తులో భాగంగా మృతుడు ఎల్.కోట మండలం వీరభద్రపేటకి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.
News April 18, 2025
పార్లమెంట్ హాజరులో MPలు కలిశెట్టి, హరీశ్ టాప్

AP: 18వ పార్లమెంట్ సమావేశాలకు TDP MPలు కలిశెట్టి అప్పలనాయుడు, GM హరీశ్ 99 శాతం హాజరై టాప్‌లో నిలిచారు. వైజాగ్ MP శ్రీభరత్ (97), చిత్తూరు MP ప్రసాద్ (93) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తక్కువ హాజరుతో YCP MP అవినాశ్ (54) చివరి స్థానంలో ఉన్నారు. ప్రశ్నలు సంధించడంలోనూ కలిశెట్టి ముందున్నారు. ఆయన మొత్తం 89 ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత మాగుంట (84) ఉన్నారు. జనసేన MP తంగెళ్ల ఉదయ్ తక్కువగా 22 ప్రశ్నలే అడిగారు.