News July 3, 2024

కొత్త చట్టాలతో బాధితులకు న్యాయం: సీపీ

image

దేశవ్యాప్తంగా జులై 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా సీపీ సునీల్ దత్ వెల్లడించారు. బాధితుడు ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ – మెయిల్‌ ఇతర సామాజిక మాధ్యమాలు వేటి ద్వారానైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. బాధితులు కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు అపోహలకు తావివ్వకుండా కొత్త చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

Similar News

News December 17, 2025

ఖమ్మం: వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ పర్యవేక్షణ

image

ఖమ్మం జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ అనుదీప్‌ నిశితంగా పర్యవేక్షించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ మానిటరింగ్‌ సెల్‌ ద్వారా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ, కల్లూరు, ఏన్కూరు, సింగరేణి మండలాల్లోని పోలింగ్‌ సరళిని వీక్షించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత, ఓటింగ్ విధానంపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు.

News December 17, 2025

11AM పోలింగ్ అప్డేట్.. ఖమ్మం జిల్లాలో 60.84%

image

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 మండలాలు కలిపి ఉ.11 గంటల వరకు 60.84% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ☆ ఏన్కూరు-65.63%, ☆ కల్లూరు- 68.41%,☆ పెనుబల్లి-55.83%, ☆ సత్తుపల్లి- 57.73%, ☆ సింగరేణి-60.09%, ☆ తల్లాడ- 60.04%, ☆ వేంసూరు- 61.69% ◇ 7 మండలాలు కలిపి ఇప్పటి వరకు 1,48,616 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News December 17, 2025

ఖమ్మంలో తుది విడత ఎన్నికలు.. 9AM UPDATE

image

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 మండలాలు కలిపి ఉ.9 గంటల వరకు 27.45% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
☆ ఏన్కూరు-25.24%
☆ కల్లూరు- 28.33%
☆ పెనుబల్లి-31.52%
☆ సత్తుపల్లి- 23.63%
☆ సింగరేణి-25.71%
☆ తల్లాడ- 28.55%
☆ వేంసూరు- 27.38%
◇ ఎన్నికల అప్డేట్ కోసం WAY2NEWS ను చూస్తూ ఉండండి.