News December 30, 2024
కొత్త బస్ షెల్టర్ ముందు పాత తరం మనుషులు!

మల్యాలలోని అంగడీ బజార్ బస్ షెల్టర్ ముందు పలువురు వృద్ధులు కూర్చొని ముచ్చటించుకోవడం స్థానికులను ఒక్కసారిగా గతానికి తీసుకెళ్లింది. చేతిలో కర్ర, నెత్తికి రుమాలు, భుజాన తువ్వాల, పంచెకట్టులో ప్రతి రోజు సాయంత్రం తాతలు కాసేపు ఇక్కడ గడుపుతారు. అయితే అంత మంది వృద్ధులు కూర్చున్నారేంటని పిల్లలు అనుకుంటున్నారు. వాళ్ల తరమే బాగుందని, కాసేపు వారితో మాట్లాడితే చాలా విషయాలు తెలుసుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు.
Similar News
News October 31, 2025
కరీంనగర్ జిల్లాకు నేడు CM..!

మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్ ప్రాంతాల్లో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి హుజూరాబాద్ మీదుగా వరంగల్ జిల్లాకు చేరుకోనున్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో ఏరియల్ సర్వే చేసిన ప్రాంతాల్లో జరిగిన నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
News October 31, 2025
దంపతుల గల్లంతు.. మృతదేహాలు లభ్యం

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగులో వరద ప్రవాహానికి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లికి చెందిన <<18150389>>దంపతులు<<>> ఈసంపల్లి ప్రణయ్(28), కల్పన(24) గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఇవాళ ఉదయం దంపతుల మృతదేహాలను గుర్తించారు. కాగా, ప్రణయ్, కల్పనను విగతజీవులుగా చూసిన బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
News October 31, 2025
KNR: ‘చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం’

KNR జిల్లా చిట్‌ఫండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొదుపు దినోత్సవం నిర్వహించారు. ‘ఈరోజు మనం పొదుపు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది కేవలం ఒక ఆచార దినం కాదు. ఇది ప్రతి కుటుంబంలో ఆర్థిక శ్రద్ధ, భవిష్యత్ భద్రత, క్రమశిక్షణకు సంకేతం’ అని అధ్యక్షులు పెంట శ్రీనివాస్ అన్నారు. చిట్ ఫండ్స్ వ్యవస్థ అనేది మన సమాజంలో ఆర్థిక సహకారం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.


