News April 9, 2024
కొత్త సంవత్సరంలో మెరుగైన అభివృద్ధి సాధించాలి: కలెక్టర్
శుభాలను ఇచ్చే సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరమని, ప్రజలందరూ శుభాలతో ఏప్రిల్ 9న ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సవాలతో జరుపుకోవాలని, కలెక్టర్ ఆకాంక్షించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా.. సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని అభిలషించారు. అలాగే కొత్త సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
Similar News
News December 29, 2024
నల్లబెల్లి: కూతురు, తల్లి సూసైడ్ ATTEMPT
కూతురికి పురుగు మందు తాగించి తల్లి కూడా తాగిన ఘటన నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. శ్రీను సంతానం కోసం మానసను రెండో వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితంలో విఘ్నేశ్, సాత్విక జన్మించారు. కాగా కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాను పురుగు మందు తాగి కూతురికి కూడా తాగించింది. గమనించిన స్థానికులు 108లో నర్సంపేట ఆసుపత్రికి తరలించారు.
News December 29, 2024
నల్లబెల్లి: అక్కడా, ఇక్కడా ఒకటే పులి
నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో నిన్న గ్రామస్థులకు పులి కనిపించిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు. కొత్తగూడ, నల్లబెల్లిలో సంచరించిన పులి ఒకటేనని వారు స్పష్టం చేశారు. కాగా, నల్లబెల్లి మండలంలోని చుట్టు పక్కల గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు. శనివారం ఓ మహిళకు, పొలానికి వెళ్లిన రైతులకు పెద్దపులి కనిపించింది.
News December 29, 2024
పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలి: డీఐఈఓ
మార్చి 5 నుంచి నిర్వహించే ఇంటర్ వార్షిక పరీక్షలకు పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని డీఐఈఓ డా.శ్రీధర్ సుమన్ అన్నారు. వరంగల్ పట్టణంలోని పలు ప్రైవేట్ కళాశాలలు, పరీక్షా కేంద్రాలను డీఐఈఓ సందర్శించారు. వార్షిక పరీక్షలకు గాను అన్ని గదుల్లో డ్యుయల్ డెస్కులు, గాలి, నీరు, విద్యుత్, ఫ్యాన్లు, నీటి వసతి, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని డీఐఈఓ సూచించారు.