News October 26, 2024

కొద్ది గంటల్లో ముగిస్తున్న ITI ప్రవేశాల గడువు

image

జిల్లాలో మూడు ప్రభుత్వ, 20 ప్రైవేటు ఐటిఐల్లో మిగిలిన సీట్లకు ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు మరి కొద్ది గంటల్లో ముగుస్తుంది. ఈ మేరకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేటి సాయంత్రం లోపు iti.ap.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం సమీప ప్రభుత్వ ఐటీఐకి వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. 28న ప్రభుత్వ ఐటీఐల్లో, 30న ప్రైవేటు ఐటిఐల్లో ఉదయం 9 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

Similar News

News December 3, 2025

శ్రీకాకుళం: కొండెక్కిన టమాటాల ధర

image

శ్రీకాకుళం మార్కెట్లో టమాటా ధరలు చుక్కలు తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో 70 రూపాయలు పలుకుతోంది అక్టోబర్, నవంబర్ నెలలలో కిలో టమాటాల ధర సగటున రూ.30 నుంచి రూ.50కు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటికీ 70 రూపాయలుగా ఉందని, ఇది ₹100 దాటవచ్చని అంటున్నారు. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు అయ్యప్ప దీక్షల కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగిందంటున్నారు. మీ ఏరియాలో ధర ఎంతో కామెంట్ చేయండి.

News December 3, 2025

ఎచ్చెర్ల: మహిళ హత్య?

image

ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి పరిశీలన జరుపుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 3, 2025

శ్రీకాకుళం: అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

పాఠశాలల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎ.రవిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 24 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఐదు నెలల కాలానికి పనిచేయవలసి ఉంటుందన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 5 లోపు ఎంఆర్సీల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.