News October 26, 2024
కొద్ది గంటల్లో ముగిస్తున్న ITI ప్రవేశాల గడువు
జిల్లాలో మూడు ప్రభుత్వ, 20 ప్రైవేటు ఐటిఐల్లో మిగిలిన సీట్లకు ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు మరి కొద్ది గంటల్లో ముగుస్తుంది. ఈ మేరకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేటి సాయంత్రం లోపు iti.ap.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం సమీప ప్రభుత్వ ఐటీఐకి వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. 28న ప్రభుత్వ ఐటీఐల్లో, 30న ప్రైవేటు ఐటిఐల్లో ఉదయం 9 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Similar News
News November 14, 2024
కోటబొమ్మాళి: రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతి
కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతిచెందింది. ఈ మేరకు రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పలాస జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. కాగా వృద్ధురాలు వివరాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
News November 13, 2024
ఎచ్చెర్ల: ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్
ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన మొదలవలస చిన్నారావు (33) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని బికనీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాను ఉన్న గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. స్వగ్రామానికి మృతదేహం తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
News November 13, 2024
మాదకద్రవ్య రహిత శ్రీకాకళం జిల్లాగా కృషి చేయాలి: ఎస్పీ
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా రూపుదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ విచ్చలవిడిగా శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్నట్లుగా సమాచారం ఉందని దీన్ని పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.