News September 24, 2024
కొనకళ్ల నారాయణరావు త్యాగానికి దక్కిన ప్రతిఫలం
తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న కొనకళ్ల నారాయణరావు త్యాగానికి ప్రతిఫలం దక్కింది. మచిలీపట్నం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన నారాయణరావు 2024 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా మచిలీపట్నం ఎంపీ సీటును జనసేన పార్టీకి త్యాగం చేశారు. జనసేన నుంచి ఎంపీగా పోటీ చేసిన బాలశౌరి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా నారాయణరావును APSRTC ఛైర్మన్ పదవి వరించింది.
Similar News
News October 6, 2024
కృష్ణా: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీ.ఏ.) చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 25 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు 17 నుంచి 26 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
News October 6, 2024
గన్నవరంలో బంధించి పెళ్లి చేసిన పెద్దలు
గన్నవరం మండలం సూరంపల్లిలో ఓ యువకుడిని గ్రామస్థులు బంధించి పెళ్లి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సూరంపల్లికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన గుడ్డేటి ప్రసన్నతో ప్రేమాయణం నడిపారు. కులాలు వేరు వేరు కావడంతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో శ్రీకాంత్ గ్రామానికి రావడంతో మహిళలు బంధించి ప్రసన్నతో పెళ్లి చేశామని గ్రామస్థులు తెలిపారు.
News October 6, 2024
ప్రయాణికుల రద్దీ మేరకు బెంగుళూరుకు ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్‌సుఖియా (NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 7 నుంచి డిసెంబర్ 26 వరకు ప్రతి గురువారం NTSK-SMVB(నం.05952), నవంబర్ 11 నుంచి డిసెంబర్ 30 వరకు ప్రతి సోమవారం SMVB-NTSK(నం.05951)మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.