News May 19, 2024
కొనకళ్ళను పరామర్శించిన వైసీపీ MLA పేర్ని నాని
హార్ట్ స్ట్రోక్‌కి గురై శస్త్ర చికిత్స చేసిన అనంతరం విజయవాడలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌లో కోలుకుంటున్న, మాజీ బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావుని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆదివారం పరామర్శించారు. త్వరగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.
Similar News
News December 14, 2024
డోకిపర్రు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న CM చంద్రబాబు
గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో CM చంద్రబాబునాయుడు శనివారం పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం హెలికాప్టర్లో డోకిపర్రు చేరుకున్న చంద్రబాబుకు భూ సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్వాహకులు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబును మర్యాదపూర్వకంగా ఆలయంలోకి తీసుకువెళ్లారు. కాగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
News December 14, 2024
ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా: కలెక్టర్
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. భావితరాలకు భరోసా కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. శనివారం జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ర్యాలీని విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడారు.
News December 14, 2024
నేడు గుడ్లవల్లేరుకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే.!
సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మండలంలోని డోకిపర్రుకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకుంటారని CMO అధికారులు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు భూసమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయం చేరుకొని, రోడ్డు మార్గంలో 5.40కి పోరంకి మురళి రిసార్ట్స్‌లో జరిగే NTR వజ్రోత్సవాలకు సీఎం హాజరవుతారన్నారు.