News June 5, 2024
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను నల్గొండలో లెక్కిస్తున్నారు. ప్రస్తుతం బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగుతుంది. 96 టేబుళ్లపై ఓట్ల కొనసాగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 24 గంటల పాటు ఎన్నికల కౌంటింగ్ కొనసాగనుంది. ఓట్ల లెక్కింపులో 2,800 మంది సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News December 9, 2024
సిద్దేశ్వరస్వామి వారికి ప్రత్యేక అలంకరణ
హన్మకొండలోని స్వయం భూ లింగం శ్రీ సిద్దేశ్వరస్వామి దేవాలయంలో మార్గశిర మాసం సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో అలంకరించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సురేశ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
News December 9, 2024
ములుగు: నేడు మావోయిస్టుల బంద్.. టెన్షన్.. టెన్షన్
నేడు మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏటూరునాగారం ఏజెన్సీలో పోలీసులు ఆదివాసీ గూడాలు, అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎస్ఔ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పలు లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. ఎవరైన గుర్తు తెలియని వ్యక్తులు లాడ్జీల్లో ఉన్నారా..? అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు.
News December 8, 2024
ప్రత్యేక రూపంలో భద్రకాళి అమ్మవారు
వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈ రోజు ఆదివారం ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.