News February 19, 2025

కొనసాగుతున్న ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీలు.. భారీగా పోలీసులు మొహరింపు

image

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్న శివాజీ జయంతి ఊరేగింపులకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించారు.

Similar News

News March 21, 2025

MBNR: భూముల అమ్మకాల నిర్ణయాన్ని విరమించుకోవాలి: ABVP

image

HCU యూనివర్సిటీల భూముల వేలాన్ని వెంటనే ఆపాలని పాలమూరు యూనివర్సిటీ ముందు ఈరోజు ఏబీవీపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కో కన్వీనర్ కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా పాలన అని చెప్పి అధికారంలోకొచ్చి విద్యావ్యవస్థను తుంగలో తొక్కిందన్నారు. తెలంగాణలోని యూనివర్సిటీల భూములను వేల వేయడం ప్రభుత్వానికి చేతగానితనం వారు విమర్శించారు.విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే నిరసన చేస్తామన్నారు.

News March 21, 2025

IPL అభిమానులకు గుడ్ న్యూస్

image

IPL ప్రేమికులకు BCCI శుభవార్త చెప్పింది. దేశంలోని 50 నగరాల్లో ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. స్టేడియంను తలపించేలా లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్, మ్యూజిక్, ఫుడ్ కోర్ట్స్, ఎంటర్టైన్‌మెంట్, కిడ్స్ ప్లే జోన్, ప్లే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో నిజామాబాద్ (APR 5,6 తేదీల్లో), విజయవాడ (MAY 10,11), వరంగల్ (MAY 17, 18), కాకినాడ (MAY 23, 25)లో ఏర్పాటు కానున్నాయి.

News March 21, 2025

వచ్చే నెల 3న క్యాబినెట్ భేటీ

image

AP: వచ్చే నెల 3న సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. అమరావతిలోని సచివాలయంలో జరిగే ఈ భేటీలో పలు కీలక విషయాలపై మంత్రిమండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి పనులపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

error: Content is protected !!