News August 19, 2024
కొనసాగుతున్న సాగర్ నీటి విడుదల

నాగార్జునసాగర్ నుంచి రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగింది. శ్రీశైలం నుంచి 71,259 క్యూసెక్కుల వరదనీరు సాగర్ జలాశయానికి చేరగా సాగర్ నుంచి రెండు గేట్లను ఎనిమిది అడుగుల మేరకు ఎత్తి 24,920 క్కూసెక్కుల నీటిని దిగువ విడుదల చేశారు. గేట్లతో పాటు కుడికాల్వ ద్వారా 8,067, ఎడమకాల్వ ద్వారా 6,478 , ప్రధాన విద్యుత్తు కేంద్రం ద్వారా 29,394, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Similar News
News December 4, 2025
నల్గొండ: చలికాలంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లాలో దట్టంగా కమ్ముకునే పొగమంచు వలన రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని జిల్లా ఎస్పీ శ్రీశరత్ చంద్ర పవార్ వాహనదారులను హెచ్చరించారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా కనిపించకపోవడంతో పాటు, ముందున్న వాహనాల దూరాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని ఎస్పీ తెలిపారు.
News December 4, 2025
చండూరు: సర్పంచ్ బరిలో అక్కాచెల్లెళ్లు

చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు బరిలో నిలవడంతో ప్రజల్లో ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా కావలి స్వాతి పోటీ చేస్తుండగా, కావలి శివాని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యే గట్టి పోటీ ఉంటుందని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
News December 4, 2025
NLG: రెండు రంగుల్లో బ్యాలెట్ పత్రాలు

సర్పంచ్, వార్డు సభ్యుడికి బ్యాలెట్ పత్రాలు వేర్వేరుగా ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థికి గులాబీ రంగు, వార్డు సభ్యుడికి తెలుపు రంగు ఉన్న బ్యాలెట్ పేపర్ను ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తున్నారు. నల్గొండ, చండూరు డివిజన్ పరిధిలో 14 మండలాల్లో 318 గ్రామపంచాయతీలో 991 సర్పంచ్ అభ్యర్థులు, 2,870 వార్డుల్లో 7,893 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడత పోలింగ్కు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.


