News April 4, 2025
కొనసాగుతున్న EAPCET దరఖాస్తుల ప్రక్రియ

JNTU యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న TS -EAPCET 2025 ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తులు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సాయంత్రానికి 2,91,965 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్కు సంబంధించి 2,10,567, అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి 81,172, రెండు విభాగాలకు సంబంధించి 226 దరఖాస్తులు వచ్చాయన్నారు.
Similar News
News October 15, 2025
నవంబర్ 1 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి భక్తుల కోసం నవంబర్ 1 నుంచి భవానీ దీక్షల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం దీక్షలు ప్రారంభమవుతాయి. భక్తులు నవంబర్ 5 వరకు దీక్షలు స్వీకరించవచ్చు. అర్ధ మండల దీక్షలు నవంబర్ 21 నుంచి మొదలవుతాయి. భవానీ దీక్షల విరమణ కార్యక్రమం డిసెంబర్ 11న ప్రారంభమై, 15న పూర్ణాహుతితో ముగుస్తుంది.
News October 15, 2025
మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

ధన త్రయోదశి(OCT 18) సమీపిస్తున్న వేళ బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. HYD బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.1,28,890కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రా.ల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.1,18,150గా ఉంది. అలాగే KG వెండిపై రూ.1,000 ఎగబాకి రూ.2,07,000కు చేరింది. గత 10 రోజుల్లోనే వెండిపై రూ.42వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 15, 2025
కొండా సురేఖ, పొంగులేటి మధ్య విభేదాలకు ఆయనే కారణమా?

మంత్రి కొండాసురేఖ OSDసుమంత్ను పీసీబీ టర్మినేట్ చేయగా.. దేవాదాయ, అటవీశాఖ విభాగాల పరిపాలనలో తన స్థానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. మేడారం అభివృద్ధికి కాంట్రాక్ట్ పనులను అప్పగించడంలో సురేఖ, మంత్రి పొంగులేటి మధ్య విభేదాలు సృష్టించడంలో సుమంత్ పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాగా DEC 2023లో OSDగా నియమితులైన సుమంత్ కాంట్రాక్టును 2025చివరివరకు పొడిగించగా తాజాగా వేటుపడింది.