News April 16, 2025
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: అ.కలెక్టర్

మునగాల మండల బరాఖత్ గూడెం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.
Similar News
News December 1, 2025
ధాన్యం రవాణాకు GPS వాహనం తప్పనిసరి: కలెక్టర్

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్ఎస్కే) ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి, ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 1, 2025
నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి

ఉరవకొండ మండలం బూదిగవిలో రూ.43.75 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.
News December 1, 2025
DEC 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం: వేణుగోపాల్ రావు

డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయ సముదాయంలోని పరేడ్ గ్రౌండ్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు ప్రకటించారు. దివ్యాంగుల హక్కులు, సంక్షేమంపై అవగాహన పెంపే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


