News February 11, 2025
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తేలిన ఓటర్ల సంఖ్య

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల ఓటర్ల వివరాలను ముఖ్య ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 15 మండలాల్లో 1,77,105 పురుషుల ఓట్లు ఉండగా, 1,77,567 మహిళల ఓట్లు ఉన్నాయి. 19 థర్డ్ జెండర్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. పురుషుల కంటే మహిళలు 462 ఓట్లు అధికంగా ఉన్నాయన్నారు. జిల్లాలో మొత్తం 3,54,691 మంది ఓటర్లు ఉన్నట్లుగా తెలిపారు.
Similar News
News November 27, 2025
జనగామ: మొదటి రోజు 108 నామినేషన్లు దాఖలు

జనగామ జిల్లాలో మొదటి విడతలో భాగంగా చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథ్‌పల్లి, జాఫర్‌గఢ్, లింగాల గణపురం 5 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. చిల్పూర్-17, స్టేషన్ ఘనపూర్-17, రఘునాథ్‌పల్లి-35, జాఫర్‌గఢ్-24, లింగాల గణపురం-15 సర్పంచ్ నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 108 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు.
News November 27, 2025
మెదక్ జిల్లాలో మొదటి రోజు 55 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మొదటి రోజు 55 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అల్లాదుర్గంలో 5, రేగోడులో 6, పెద్ద శంకరంపేటలో 7, టేక్మాల్‌లో 5, పాపన్నపేటలో 13, హవెలిఘనాపూర్లో 16 చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే వాడు మెంబర్ స్థానాలకు టేక్మాల్ మండలంలో ఒకటి, హవేలిఘనపూర్‌లో మూడు నామినేషన్ దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి ఎక్కువ సంఖ్యలో నామినేషన్ దాఖలు అయ్యే అవకాశం ఉంది.
News November 27, 2025
ఎన్నికలకు అవసరమైన బందోబస్తు సిద్ధం: ADB SP

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన భద్రతా బందోబస్తు ఇప్పటికే సిద్ధం చేస్తున్నామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకునేలా పోలీసు విభాగం సన్నద్ధమైందన్నారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తే తప్పనిసరిగా రసీదులు, డాక్యుమెంట్లు ఉండాలని సూచించారు.


