News May 24, 2024
కొమరవోలులో పిడుగు పడి మహిళా రైతు మృతి

రోలుగుంట మండలం కొమరవోలు గ్రామానికి చెందిన గణేశ్వరి(39) పిడుగుపాటుకు గురై మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం తనకు ఉన్న పశువులను మేతకు తీసుకువెళ్ళింది. వాటిని మేపుకుంటూ పొలం వద్ద ఉండగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో గణేశ్వరిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త తమ్మునాయుడుతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Similar News
News October 24, 2025
విశాఖ: రోజ్‌గార్ మేళాలో యువతకు నియామక పత్రాల అందజేత

ఉడా చిల్డ్రన్ ఏరియాలో శుక్రవారం రోజ్‌గార్ మేళా నిర్వహించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాస్ పాల్గొని నూతనంగా ఉద్యోగాలు సాధించిన 100 మంది యువతకు ప్రభుత్వ శాఖలలో నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో 51వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు ఈరోజు అందజేసినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.
News October 24, 2025
ప్రోపర్టీ రికవరీ మేళా నిర్వహించిన విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో శుక్రవారం విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రోపర్టీ రికవరీ మేళాను నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో 56 కేసుల్లో 64మందిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి నుంచి 766.35 గ్రాముల బంగారం, 699.6 గ్రాముల వెండి, 436 మొబైల్ ఫోన్స్, రూ.1,95,800 నగదు, 12 బైక్స్ రికవరీ చేసుకొని బాధితులకు అందజేశారు. మొత్తం రూ.1,10,10,050 సొత్తు రికవరీ చేసినట్లు సీపీ వెల్లడించారు.
News October 24, 2025
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌కు 19 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ నిర్వహించారు. ఈ ఫోరమ్‌లో 19 వినతులను జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకారరావు స్వీకరించారు. ముఖ్యంగా 2వ జోన్‌కు 3, 3వ జోన్‌కు 5, 4 వ జోన్‌కు 1, 5వ జోన్‌కు 3, 6వ జోన్‌కు 2, 8వ జోన్‌కు 5 వినతులు వచ్చాయని తెలిపారు. ఓపెన్ ఫోరమ్‌లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు.


