News March 25, 2025

కొమరాడ: తండ్రి మరణం.. పది పరీక్షకు కుమారుడు

image

కొమరాడ మండలం అల్లవాడ గ్రామానికి చెందిన బిడ్డిక రామారావు సోమవారం ఉదయం అకాల మరణం పొందారు. చరణ్ పెద్దకుమారుడు పదో తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. తండ్రి మరణించిన బాధలోనే చరణ్ కన్నీరు పెట్టుకుంటూ గణితం పరీక్షకు వెళ్లాడు. పెద్దనాన్న కొడుకు బిడ్డిక సతీశ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 5, 2025

కుడా భవనం ఆ అల్లుడి కోసమేనా..?

image

కుడా భవనంను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి రంగం సిద్దమైంది. ప్రభుత్వ డబ్బులతో కట్టిన బిల్డింగ్‌ను, నిర్వహణ భారం పేరిట ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడానికి ఈనెల 15వ తేదీని టార్గెట్‌గా నిర్ణయించారు. కుడా కార్యాలయంలోని 8 విభాగాలను, ప్రధాన కార్యాలయాన్ని, కాళోజీ కళా క్షేత్రానికి తరలించాలని నిర్ణయించారు. లీజ్ పేరిట ప్రస్తుత కుడా కార్యాలయాన్ని ఓ నేత అల్లుడికి ఆసుపత్రి కోసం ఇస్తున్నట్టు సమాచారం.

News December 5, 2025

ప్రకాశం: PTMకు ముస్తాబైన పాఠశాలలు

image

జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జిల్లాలోని 2,409 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాన్ని జరపాలని అన్నారు. PTM కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పాఠశాలల్లో పూర్తి చేసి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్తాబు చేశారు.

News December 5, 2025

కామారెడ్డి జిల్లాలో చలి ప్రభావం ఎలా ఉందంటే?

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. లచ్చపేట 13.1°C, బీబీపేట 13.3, ఎల్పుగొండ 13.4, జుక్కల్, గాంధారి 14.2, బొమ్మన్ దేవిపల్లి, రామారెడ్డి 14.3, సర్వాపూర్, నస్రుల్లాబాద్ 14.4, దోమకొండ 14.5, ఇసాయిపేట 14.6, బిచ్కుంద, డోంగ్లి 14.8, బీర్కూరు, పుల్కల్, మాచాపూర్, నాగిరెడ్డి పేట 15°Cగా ఉంది.