News April 15, 2025
కొమరాడ: రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కొమరాడ మండలం అర్థం సోమినాయుడు వలస రైల్వే గేట్ల సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఇన్ఛార్జి రత్నాకర్ తెలిపిన వివరాలు ప్రకారం.. రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని కొప్పర వెంకటరమణ (26) మృతి చెందినట్లు తెలిపారు. సమీపంలో తన పొలం చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాట్లు పేర్కొన్నారు.
Similar News
News November 26, 2025
ఎఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని (కోడ్) అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లో ఎస్పీ సునీతతో కలిసి ఆయన నోడల్ అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్ల ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలన్నారు.
News November 26, 2025
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అంబేడ్కర్ స్మృతి వనం: జడ శ్రవణ్

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనాన్ని సందర్శించి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా స్మృతి వనం అధ్వానంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆయన మండిపడ్డారు. విగ్రహం ధ్వంసం అయ్యేలా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.స్మృతి వనం పరిరక్షణకు, సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News November 26, 2025
ఘోర ప్రమాదం.. ఇద్దరు సిక్కోలు వాసుల మృతి

తమిళనాడు రామేశ్వరం సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలాస(M) పెదంచల, వీర రామచంద్రపురం గ్రామాలకు చెందిన ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయ్యప్పమాల ధరించి పలువురు శబరిమలై, రామేశ్వరం వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ఇల్లాకుల నవీన్(24), పైడి సాయి(26)గా పోలీసులు గుర్తించారు. గుంట రాజు, పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినేని గణేశం గాయపడ్డారు.


