News April 13, 2025

కొమరాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొమరాడ సెంటర్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తవలసకి చెందిన బిడ్డ లక్ష్మణ్ మృతి చెందారు. రాయగడ వైపు నుంచి పార్వతీపురం వస్తున్న లారీ రహదారి పక్కగుండా నడిచి వెళ్తున్న బిడ్డ లక్ష్మణను ఢీకొంది. ఈ ఘటనలో లక్ష్మణ్ వంటిపై నుంచి లారీ వెళ్లడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కొమరాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 24, 2025

కాళోజీ యూనివర్సిటీలో విజిలెన్స్ తనిఖీలు

image

డబ్బులు తీసుకొని <<18373249>>మార్కులు కలిపారంటూ వచ్చిన కథనాల<<>>పై విజిలెన్సు అధికారులు కదిలారు. WGL కాళోజీ హెల్త్ యూనివర్సిటీ PG పరీక్షల రీకౌంటింగ్‌లో జరిగిన అవకతవకలపై ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో విజిలెన్సు అధికారులు ఎగ్జామినేషన్ విభాగంలోని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎవరి లాగిన్లో ఈ అక్రమాలు జరిగాయో అధికారుల తనిఖీ అనంతరం బయటపడే అవకాశం ఉంది.

News November 24, 2025

అపరిచితులకు మీ వివరాలు ఇవ్వొద్దు: పోలీసులు

image

కేవలం 5 నిమిషాల్లో లోన్ వస్తుందనే మాటల్ని నమ్మి, అపరిచితులకు మీ వివరాలు ఇవ్వద్దని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్బీఐ అనుమతి లేని యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయొద్దని, వాటి నుంచి లోన్ తీసుకోవద్దని, ఎవరికి ఆన్లైన్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపించొద్దని పోలీసులు ప్రజలకు సూచనలు చేశారు.

News November 24, 2025

నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం

image

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర ఆరోగ్యం విషమించింది. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఈక్రమంలోనే అంబులెన్స్ ఆయన ఇంటికి చేరుకుంది. అటు బంధువులు, బాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్ర ఇంటికి వెళ్తున్నారు.