News October 22, 2024
కొమరాడ: విద్యుత్ షాక్తో బాలుడు మృతి
కొమరాడ మండలం కూనేరు గ్రామంలో ఓ బాలుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. స్థానికంగా ఉన్న చర్చికి ఎలుకలు వచ్చి వస్తువులను పాడు చేస్తున్నాయని కడ్రక కృష్ణ అనే వ్యక్తి చర్చి చుట్టూ విద్యుత్ (కంచెను) ఎర్త్ పెట్టాడు. ఆ విషయం తెలియని బాలుడు జిన్నాన అనేష్ (4) ఆడుకుంటూ వెళ్లి ఆ వైర్లను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలపడంతో కొమరాడ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
Similar News
News January 3, 2025
VZM: ఉమ్మడి జిల్లా వాలీబాల్ క్రీడాకారులకు అలర్ట్
స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఈనెల 5 మధ్యాహ్నం 2 గంటలకు ఉమ్మడి విజయనగరం జిల్లా సీనియర్ బాలుర వాలీబాల్ జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.సూరిబాబు, కేవీఏఎన్.రాజు తెలిపారు. క్రీడాకారులు అందరూ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తప్పక హాజరు కావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు త్వరలో రాష్ట్రంలో జరిగే వివిధ సీనియర్ రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.
News January 3, 2025
VZM: చికిత్స పొందుతూ మృతి
విజయనగరం పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది. తన 10 నెలల చిన్నారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లడిల్లిన తల్లి అన్నపూర్ణ దిష్టి తీసి డాబాపైకి వెళ్లి విసిరే క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన డిసెంబర్ 28న జరగగా విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ జనవరి 1న ఆమె మృతి చెందింది. SI అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 3, 2025
VZM: జిల్లాలో ఇక సౌర వెలుగులు..!
విజయనగరం జిల్లాలో సౌర విద్యుత్ను ప్రోత్సాహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ముందుగా 51 వేల ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఫిబ్రవరి నెలాఖరిలోగా సౌర విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. రాయతీపై ఆయా కుటుంబాలకు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దరఖాస్తు చేసిన వారికి సత్వరమే సౌర విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశాలు జారీ చేశారు.