News August 5, 2024
కొమరోలు: మంచం పట్టిన చింతలపల్లి గ్రామం

కొమరోలు మండలం చింతలపల్లిలో ప్రజలు సీజనల్ వ్యాధుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికి ఒకరు లేదా ఇద్దరు మంచం పట్టారు. సీజనల్ వ్యాధులు సోకుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొంతమందికి ఇళ్ల వద్ద చికిత్స అందించారు. మరి కొంతమంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News November 3, 2025
టంగుటూరు: తోపులాటలో అల్లుడి మృతి

టంగుటూరు శ్రీనివాసనగర్కు చెందిన దివ్యకీర్తితో వంశీకి ఆరేళ్ల కిందట వివాహమైంది. వంశీ హైదరాబాద్లో సాప్ట్వేర్ జాబ్ కావడంతో అక్కడ కాపురం పెట్టారు. ఇటీవల భర్తతో గొడవపడి దివ్య తన ఇద్దరు బిడ్డలతో టంగుటూరులోని పుట్టింటికి వచ్చింది. వంశీ ఆదివారం భార్య ఇంటికి వచ్చి బంధువులతో రాజీకి ప్రయత్నించారు. ఈక్రమంలో తోపులాట జరిగి వంశీ కిందపడి స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని నిర్ధారించారు.
News November 3, 2025
ప్రకాశం: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు

రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలామంది వాట్సాప్ గ్రూపులను దుష్ప్రచారానికి వాడుతున్నారు. తెలిసీతెలియక గ్రూపుల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని క్రాస్ చెక్ చేయకుండా షేర్ చేస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు ఇస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టింగులు చేసినా? తప్పుడు ప్రచారం చేసినా అడ్మిన్లు బాధ్యత వహించాలని చెబుతున్నారు. మీకూ నోటీసులు ఇచ్చారా?
News November 3, 2025
ప్రకాశం జిల్లా ప్రజలకు SP కీలక సూచనలు..!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు SP హర్షవర్ధన్ రాజు ఆదివారం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితోపాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాల్లో మన అప్రమత్తతే మనకు రక్షని సూచించారు.


