News February 4, 2025

కొమురంభీమ్: కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రచారం

image

బెజ్జూర్ మండలంలోని గబ్బాయి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు సురేశ్ గౌడ్ ఆధ్వర్యంలో MLC ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థి ఆల్ఫోర్స్ డా.వి.నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Similar News

News November 21, 2025

కుసుమ ప్రతిభకు ఎమ్మెల్యే శ్రావణి సత్కారం

image

దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి, దేశ కీర్తిని చాటిన నార్పల మండలం దుగుమరి గ్రామానికి చెందిన 19 ఏళ్ల కుసుమను ఎమ్మెల్యే బండారు శ్రావణి అభినందించారు. కుసుమను, ఆమె కుటుంబ సభ్యులను తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి, ఆర్థిక సాయం అందించారు. ఎవ‌రెస్ట్‌ను అధిరోహించడమే తన లక్ష్యమ‌ని కుసుమ తెలపగా, కూటమి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

News November 21, 2025

NCCDలో ఉద్యోగాలు

image

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్‌ (NCCD) 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 8వరకు అప్లై చేసుకోవచ్చు. contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: nccd.gov.in.

News November 21, 2025

రైల్వే గేటు వద్ద బైకులు ఢీకొని యువకుడి మృతి

image

మండవల్లి మండలం చావలిపాడు రైల్వే గేటు వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గేటు పడుతుండగా వేగంగా దాటే క్రమంలో రెండు మోటార్ సైకిళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కైకలూరు మండలం ఆలపాడుకు చెందిన పడమటి సత్యనారాయణ మృతి చెందగా, మాజీ ఏఎంసీ ఛైర్మన్ తలారి వెంకటస్వామికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.