News February 4, 2025
కొమురంభీమ్: కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రచారం

బెజ్జూర్ మండలంలోని గబ్బాయి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు సురేశ్ గౌడ్ ఆధ్వర్యంలో MLC ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థి ఆల్ఫోర్స్ డా.వి.నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News February 15, 2026
జాబ్ క్రియేటర్లుగా డేటా సెంటర్లు: మోదీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాకు INDలో ఆశ్రయం కల్పిస్తామని PM మోదీ ప్రకటించారు. డేటా సెంటర్లు యువతకు భారీగా ఉద్యోగాలను కల్పిస్తాయన్నారు. ‘కంప్యూటింగ్ పవర్, డేటా సెంటర్ ఇన్‌ఫ్రా సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోంది. తద్వారా ఏఐ ఎకోసిస్టమ్‌కు పునాది వేస్తోంది. ఈ ఏడాది 7 ప్రధాన నగరాల్లోని డేటా సెంటర్ల సామర్థ్యం 1.7GW దాటుతుందని అంచనా’ అని పేర్కొన్నారు. కాగా రేపు ఢిల్లీలో <<19143850>>ఏఐ సమ్మిట్‌ను<<>> PM ప్రారంభించనున్నారు.
News February 15, 2026
ప్రభాస్‌కు గాయం!

సినీ హీరో ప్రభాస్ గాయపడినట్లు సమాచారం. ఫౌజీ సినిమా షూటింగ్‌లో హార్స్ రైడ్ చేస్తుండగా ఆయనకు గాయమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో ఇవాళ షూటింగ్‌కు బ్రేక్ తీసుకున్నారని, రేపట్నుంచి మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటారని టాక్. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కీలకదశలో ఉంది. అటు సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు.
News February 15, 2026
అనంత: PGRS రద్దు.. కారణం ఇదే.!

ఈనెల 16న జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. CM ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలతో కలిసి బిల్గేట్స్ బృందంతో విజయవాడలో జరిగే సమావేశం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కూడా కార్యక్రమాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు.


