News March 15, 2025
కొమురవెల్లికి బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు!

జనగామ బస్టాండ్‌లో కొమురవెల్లికి వెళ్లే భక్తులకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా ఒక్క బస్సు కూడా రావడం లేదని వాపోతున్నారు. జాతరకు వెళ్లే భక్తులకు సరైన బస్సు సౌకర్యాలు అందించాలని పలువురు కోరుతున్నారు. అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
Similar News
News March 16, 2025
NGKL: అయ్యో పాపం.. చిన్నారి మృతి

బల్మూరు మండలం చిన్నారి సంపులో పడి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కొండనాగులకి చెందిన చింత మహేశ్, సుస్మిత దంపతులకు చిన్నారి నాన్సీ(2) ఉంది. ఆడుకుంటూ పక్కింటికి వెళ్లింది. చిన్నారిని ఎవరూ గమనించకపోవటంతో ఇంటి ఎదుట ఉన్న సంపులో పడింది. కొంత సేపటికి గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతిచెందింది.
News March 16, 2025
నేడు అమరజీవి జయంతి

మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు. దీక్ష ప్రారంభించిన తొలిరోజు 53.9 కేజీలు ఉన్న ఆయన 58వ రోజుకు 38.1 కేజీలకు తగ్గారు. 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు దీక్ష చేశారు. దీక్ష చివరి రోజు ప్రాణాలు వదిలారు. ఈయన పోరాటంతో 1953 OCT 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
News March 16, 2025
MHBD: మట్టి దారులు.. ఇక సీసీ రోడ్లు!

మహబూబాబాద్ జిల్లా సీసీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 641 నూతన రోడ్ల నిర్మాణం కోసం 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.33.75 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా, ఈనెల 31 వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి చొరవతో 75% పల్లె రోడ్లు సీసీ రోడ్లుగా మారుతాయని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు.