News February 9, 2025

కొమురవెల్లిలో బందోబస్తును పరిశీలించిన ఏసీపీ

image

కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ నాల్గవ ఆదివారం సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ సతీష్ పార్కింగ్ ప్రదేశాలను, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, సాధారణ దర్శన ప్రదేశాలను, టెంపుల్ ఆవరణను పరిశీలించారు. అధికారులకు, సిబ్బందికి, కమ్యూనికేషన్స్ సెట్ ద్వారా బందోబస్తు పర్యవేక్షణ చేస్తూ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు.

Similar News

News October 16, 2025

అంగన్వాడీల్లో పోషణ బలోపేతం చేయండి: కలెక్టర్

image

మహిళా, శిశు అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ‘పోషణ మాసం’ ముగింపు కార్యక్రమం గురువారం ఐడీవోసీలో జరిగింది. KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..లోప పోషణ స్థాయిని తగ్గించడానికి, గర్భిణీలు/బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లో సరైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంతకు ముందు కలెక్టర్ అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన చిరుధాన్యాల పోషకాహార ప్రదర్శనను వీక్షించారు.

News October 16, 2025

నాలుగో రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని

image

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూల్ జిల్లాలో నేడు పర్యటించిన సంగతి తెలిసిందే. కర్నూల్ శివారులో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో మోదీ ప్రారంభించారు. కొత్తవలస-విజయనగరం మధ్య రూ. 493 కోట్లతో చేపట్టే నాలుగో రైల్వే లైన్‌ను, అలాగే పెందుర్తి – సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ల మధ్య రూ.184 కోట్లతో నిర్మించే రైల్వే వంతెనను ప్రారంభించారు.

News October 16, 2025

క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

image

TG: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన సురేఖ.. సచివాలయానికి రాకుండా బయటకు వెళ్లిపోయారు. మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. ఇటీవల నెలకొన్న <<18020734>>వివాదాలతో<<>> ఆమె మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.