News February 5, 2025
కొమురవెల్లి: గుండెపోటుతో టీచర్ మృతి

సిద్దిపేట జిల్లాలో గుండెపోటుతో టీచర్ మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లి మండలం మరి ముచ్చాల గ్రామానికి చెందిన అశోక్(50) టీచర్. ఇటీవలే కొమరవెల్లి ZPHS ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసిన ఆయన దుబ్బాక మండలం దుంపలపల్లి పాఠశాలకు పీఈటీగా బదిలీపై వెళ్లారు. కాగా ఈ ఉదయం ఆయన గుండెపోటుతో చనిపోయారు. భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News February 17, 2025
పండ్ల మార్కెట్లో అగ్నిప్రమాదం

AP: రాజమండ్రి దివాన్‌చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్‌లోని కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. వ్యాపారులు వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
News February 17, 2025
ప్రార్థనా స్థలాల చట్టం కేసు: సుప్రీంకోర్టు అసంతృప్తి

ప్రార్థనా స్థలాల చట్టం కేసుపై కుప్పలు తెప్పలుగా కొత్త పిటిషన్లు రావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ముగ్గురు సభ్యుల బెంచ్ వాదనలు వినడంతో ఇద్దరితో కూడిన తమ బెంచ్ పెండింగ్ పిటిషన్లను తీసుకోబోదని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘పిటిషన్లు వేయడానికీ ఓ పరిమితి ఉంటుంది. తాజాగా మరిన్ని వచ్చాయి. వాటిని మేం స్వీకరించలేం. మార్చిలో కొత్త తేదీ ఇస్తాం’ అని తెలిపారు.
News February 17, 2025
వరంగల్: మక్కలు క్వింటా రూ.2,355

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మొక్కజొన్న తరలివచ్చింది. అయితే గత శుక్రవారం లాగే ఈరోజు కూడా మక్కలు (బిల్టీ) ధర రూ.2,355 ధర పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.7200, పచ్చి పల్లికాయకి రూ.4,100 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.