News June 22, 2024
కొమురవెల్లి మల్లన్న హాల్ట్‌స్టేషన్‌కు మోక్షమెప్పుడో!
కొమురవెల్లి మల్లన్న హాల్ట్‌స్టేషన్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే డిసెంబరులో జరిగే మల్లన్న కళ్యాణంలోగా అందుబాటులోకి తెస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పి నాలుగు నెలలు గడుస్తున్నా నేటికి పనులు ప్రారంభం కాలేదు. దీంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్నో ఒడిదుడుకుల మధ్య స్టేషన్ మంజూరైందని సంతోషించిన ప్రజలకు పనులు ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
Similar News
News November 11, 2024
BREAKING: కోళ్ల ఫాం గోడ కూలి ఇద్దరు మృతి
మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. చిన్న శంకరంపేట మండలంలో గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. కామారం తండాలో కోళ్ల ఫాం నిర్మిస్తుండగా అకస్మాత్తుగా గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు ఝార్ఖండ్‌కు చెందిన రఖీవాల, అసిక్కుల్ షేక్‌గా గుర్తించారు. మృతదేహాలను రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
News November 11, 2024
కస్తూర్బా విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు
బోధన, భోజనం కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బోధన లేదు, భోజనం లేదంటూ బీబీపేట కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులలో కలిసి చేసిన ఆందోళనపై ఎక్స్ వేదికగా స్పందించారు. నాణ్యమైన భోజనం, మౌలిక వసతుల కల్పన కోసం విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుండటం శోచనీయం అన్నారు.
News November 11, 2024
మెదక్: మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నివాళులు
స్వాతంత్ర సమరయోధులు, తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మెదక్ సమీకృత కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఎల్లయ్య, శ్రీనివాసరావు, మాధవి, నాగరాజు గౌడ్ తదితరులున్నారు.