News August 26, 2024

కొమురవెల్లి: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడి మృతి

image

కొమురవెల్లి మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదంలో <<13938111>>ఒకరు <<>>మృతి చెందిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. చెర్యాల మండలంలోని గురువన్నపేట గ్రామానికి చెందిన అందే వీరేశం(36) శుభకార్యానికి వెళ్లొస్తానని బయటికి వెళ్లాడు. శనిగరం గ్రామానికి రాజీవ్ రహదారి గుండా బైక్‌పై వెళ్తుండగా ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వీరేశం వేగంగా వచ్చి కారు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మరణించాడు.

Similar News

News September 12, 2024

వరంగల్ జిల్లాకు ముఖ్యఅతిథిగా పొంగులేటి

image

సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవం’గా ఉత్సవాలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం కార్యక్రమాలు ఇతర సంస్కృతి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర I & PR మంత్రి శ్రీనివాస్ హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.

News September 11, 2024

అడవుల్లో ప్రకృతి ప్రకోపం అత్యంత బాధాకరం: కేటీఆర్

image

అడవుల్లో ప్రకృతి ప్రకోపం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. మానవ తప్పిదాల వల్ల పర్యావరణంలో ఇలా ఎన్నడూ లేని మార్పులు ఏర్పడుతున్నాయని, పర్యావరణాన్ని రక్షిస్తూ.. ఇలాంటి ప్రకృతి విపత్తుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ములుగు జిల్లా అటవీ ప్రాంతాన్ని భారీ చెట్ల పెంపకంతో సంరక్షించాలని కేటీఆర్ కోరారు.

News September 11, 2024

రామప్ప దేవాలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది: సీతక్క

image

రామప్ప దేవాలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రామప్ప కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పేలా అభివృద్ధి పనులను చేపట్టాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.