News January 23, 2025
కొమురవెల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

DCM, బైక్ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయలైన ఘటన కొమురవెల్లి మండలం ఐనాపూర్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న బైక్ మూలమలుపు వద్ద ఢీకొన్నాయి. కొమురవెల్లి ఎస్ఐ రాజు గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Similar News
News February 18, 2025
పెద్దపల్లి: పోస్ట్ కార్డు ద్వారా విద్యార్థుల ఆవేదన

CHO పెద్దపల్లి పట్టణంలోని ఒకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు తమ సమస్యలను పోస్ట్ కార్డు రూపంలో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, స్కూటీలు, రూ.2,500 ఆర్థిక సాయం, తులం బంగారం వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పెద్దపల్లి నియోజకవర్గ BRS నాయకురాలు దాసరి ఉష తెలుసుకున్నారు. హామీలను అమలు చేయాలని విద్యార్థులు తమ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు.
News February 18, 2025
1947లో ధరలిలా ఉండేవి!

డాలర్ విలువ ఒక రూపాయితో సమానంగా ఉండేది. 10 గ్రాముల బంగారం ధర రూ.88 మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగుల్లో అధిక జీతం రూ.2వేలు. చీపెస్ట్ కార్ రూ.2500. సౌత్ ఢిల్లీలో ఒక ఎకరం భూమి ధర రూ.17వేలు, ముంబైలో 2BHK రెంట్ రూ.20-50 మాత్రమే. బేసిక్ మెడికల్ టెస్టులు రూ.100- రూ.500. రూ.25కే సైకిల్ వచ్చేది. రూ.4కే కేజీ స్వచ్ఛమైన నెయ్యి. పెట్రోల్ ధరలు లీటర్‌కు 27 పైసలు.
News February 18, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ ఏసీబీకి పట్టుబడిన అటవీ అధికారులు✓ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భూభారతి చట్టం: మంత్రి పొంగులేటి✓ ప్రైవేటు స్కూల్ బస్ క్లీనర్ మృతి పట్ల ఆందోళన✓ భద్రాద్రిలో మిర్చి మార్కెట్ ఏర్పాటు చేయాలి ✓ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి:SFI ✓ ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం దంపతులు✓ వీధి కుక్కల నియంత్రణకు ఇల్లందులో స్పెషల్ డ్రైవ్ ✓ భద్రాచలంలో ఆక్రమిత ప్రభుత్వ భూమి స్వాధీనం