News June 16, 2024
కొమ్మనాపల్లిలో మరో 28 మందికి డయేరియా

కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. శనివారం మరో 28 మంది దీని బారిన పడినట్లు తెలిసింది. కాకినాడలోని జీజీహెచ్‌లో 16 మంది, తుని ప్రాంతీయ ఆసుపత్రిలో ముగ్గురు, మిగిలిన 9 మందికి స్థానికంగా చికిత్స అందించారు. ఈ ఊరిలో 512 కుటుంబాల్లో 1881 మంది ఉన్నారు. వారిలో 60 కుటుంబాలకు చెందిన 69 మందికి వైద్యం అందుతుంది. పలువురు ప్రైవేట్‌లో చికిత్స పొందుతున్నారు.
Similar News
News January 10, 2026
కొవ్వూరు జనసేన ఇన్‌ఛార్జ్‌గా టీవీ రామారావు పునర్నియామకం

కొవ్వూరు జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌గా టీవీ రామారావును పునర్నియమిస్తూ శనివారం పార్టీ ప్రకటన విడుదల చేసింది. గతంలో పార్టీ లైన్ అతిక్రమించడంతో ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టింది. దీనిపై జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రామారావు అనుచరులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 10, 2026
తూ.గో: నిమ్మ ధర డమాల్.. నష్టాల్లో రైతులు

తూ.గో.లో నిమ్మకాయల ధరలు పడిపోవడంతో సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత జూన్‌లో 50 కిలోల బస్తా ధర రూ.2 వేలు ఉండగా, ప్రస్తుతం సగానికి తగ్గిందని ఆరోపిస్తున్నారు. కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా దక్కడం లేదని వాపోతున్నారు. ప్రధానంగా దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం నుంచి ఇతర మండలాల్లో 3,200 హెక్టార్లలో నిమ్మ సాగు చేస్తున్న రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు.
News January 10, 2026
చింతా అనురాధకు కీలక పదవి

YCP జోన్-2 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అమలాపురం మాజీ MP చింతా అనురాధ నియమితులయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల బాధ్యతలను ఆమె పర్యవేక్షిస్తారు. 2029 ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనురాధ కృతజ్ఞతలు తెలిపారు.


