News February 5, 2025

కొమ్మాలలో అద్భుతం.. సూర్య కిరణాల మధ్య లక్ష్మీనరసింహస్వామి

image

గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండు గుట్టల నడుమ ఉన్న నరసింహస్వామి విగ్రహాలను బుధవారం ఉదయం పూజా సమయంలో సూర్యకిరణాల తాకిడితో నరసింహస్వామి ప్రతిబింబం మెరుస్తూ కనిపించింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు.

Similar News

News January 15, 2026

సంక్రాంతి రోజు ఇలా చేస్తే మంచిది!

image

పండగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలని పండితుల మాట. ‘కొత్త దుస్తులు ధరించి సూర్యుడిని స్మరించుకోవాలి. పితృదేవతలను ఉద్దేశించి దానాలు చేయాలి. ఇష్టదైవానికి పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఉదయం సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణుడి వ్రతాలు చేస్తే పుణ్యఫలం దక్కి కోర్కెలు నెరవేరుతాయి. ముఖ్యంగా శక్తిమేర దానం చేస్తే అనేక రెట్ల ఫలితం వస్తుంది’ అని చెబుతున్నారు.

News January 15, 2026

కామారెడ్డి: గాలిపటాల జోష్‌.. రోడ్లపై డెత్ రేస్!

image

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. అయితే, ఈ సరదా కాస్తా ఒక్కోసారి పెను ప్రమాదాలకు దారితీస్తోంది. గాలిపటం తెగిపోగానే దానిని పట్టుకోవాలనే తాపత్రయంతో చిన్నారులు ప్రాణాలకు తెగించి రోడ్ల వెంట పరుగు పెడుతున్నారు. పండుగ పూట విషాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే పేరెంట్స్ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి నిజామాబాద్ వాసులు మీ పిల్లలు జాగ్రత్త.

News January 15, 2026

HYD: ఇక ట్యాంక్‌బండ్ చెత్తరహితం

image

నగర శోభకు ప్రతీకగా ఉన్న ట్యాంక్‌బండ్ ను చెత్తరహితంగా మార్చేందుకు HMDA కీలక నిర్ణయం తీసుకుంది. సరైన ఫలితాలు ఇవ్వని తాత్కాలిక క్లీనింగ్‌కు ముగింపు పలుకుతూ, మూడేళ్లపాటు వ్యర్థాల తొలగింపును 2 సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమైంది. సాగరాన్ని 2 సెక్టార్లుగా విభజించి కార్మికులు, బోట్లు వినియోగించి లోపల, బయట చెత్తను తొలగించనున్నారు. ఇందుకు రూ.7.11 కోట్లు ఖర్చుచేయనున్నారు. త్వరలో టెండర్లు పిలవనున్నారు.