News February 5, 2025
కొమ్మాలలో అద్భుతం.. సూర్య కిరణాల మధ్య లక్ష్మీనరసింహస్వామి

గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండు గుట్టల నడుమ ఉన్న నరసింహస్వామి విగ్రహాలను బుధవారం ఉదయం పూజా సమయంలో సూర్యకిరణాల తాకిడితో నరసింహస్వామి ప్రతిబింబం మెరుస్తూ కనిపించింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు.
Similar News
News January 18, 2026
పశువుల రవాణా.. ఈ సర్టిఫికెట్స్ తప్పక ఉండాలి

పశువులను ఒక ప్రాంతంలో కొని మరో ప్రాంతానికి తరలించేటప్పుడు కొన్ని సర్టిఫికెట్స్‌ను మన దగ్గర ఉంచుకొని సంబంధిత అధికారులు అడిగితే చూపాలి. జీవాల కొనుగోలు, అమ్మకం రసీదు, జీవాల వయసు, ఆరోగ్యం, వాటి విలువ తెలియజేసే సర్టిఫికెట్‌ను కొనుగోలు చేసిన ప్రాంత పశువైద్యాధికారి నుంచి తీసుకోవాలి. పశువులను ఏ వాహనంలో ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎవరికి రవాణా చేస్తున్నారో తెలిపే రవాణా సర్టిఫికెట్‌ను కూడా మన దగ్గర ఉంచుకోవాలి.
News January 18, 2026
కాకినాడలో రేపు జాబ్ మేళా

కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం వద్ద ఈ నెల 19న సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ PD లచ్చారావు తెలిపారు. పదో తరగతి నుంచి ఆపై విద్యార్హతలు కలిగి, 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ ధ్రువీకరణ పత్రాలతో సోమవారం ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 18, 2026
మళ్లీ పడిపోయిన ఉష్ణోగ్రతలు

AP: ఇటీవల రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న అరకులోయలో 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు, తూ.గో., ప.గో., అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అతి తక్కువ విజిబిలిటీ నమోదైంది. అన్ని జిల్లాల్లో మంచు దుప్పటి కప్పేసింది. ఇవాళ కూడా దట్టమైన పొగమంచు ఉంటుందని, ఉ.8 గంటల వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.


