News February 5, 2025
కొమ్మాలలో అద్భుతం.. సూర్య కిరణాల మధ్య లక్ష్మీనరసింహస్వామి

గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండు గుట్టల నడుమ ఉన్న నరసింహస్వామి విగ్రహాలను బుధవారం ఉదయం పూజా సమయంలో సూర్యకిరణాలు తాకాయి. సూర్యకిరణాల తాకిడితో నరసింహస్వామి ప్రతిబింబం మెరుస్తూ కనిపించింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు.
Similar News
News November 15, 2025
త్వరలో GHMC ఉద్యోగుల బోగస్ హాజరుకు చెక్!

జీహెచ్ఎంసీ పరిధిలో ఉద్యోగుల బోగస్ హాజరు అరికట్టడం కోసం త్వరలోనే ఆటోమేటిక్ కాంటాక్ట్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు బల్దియా కసరత్తు చేస్తోంది. కార్యాలయాల్లోనూ అమలు చేసేందుకు ఇప్పటికే నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. తద్వారా రికార్డుల్లో లేకుండా వేతనాలు కాజేస్తున్న వారిని గుర్తించడం, జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతున్న వారి భరతం పట్టనున్నారు.
News November 15, 2025
VZM: కుష్టు వ్యాధిపై అవగాహన రథాన్ని ప్రారంభించిన DMHO

జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 17 నుంచి 30 వరకు ఇంటింటి సర్వే ద్వారా కుష్టు కేసులను గుర్తించే “లెప్రసీ కేస్ డిటెక్షన్ కాంపెయిన్” జరగనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. జీవనరాణి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే ఆటో ప్రచార రథాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో ప్రజలు ఆరోగ్య కార్యకర్తలకు సహకరించాలన్నారు.
News November 15, 2025
గద్వాల్: డబుల్ ట్రాక్ లేక రైళ్ల ప్రయాణం ఆలస్యం

MBNR నుంచి కర్నూల్ వరకు 130 KM డబుల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం సింగిల్ ట్రాక్ ఉండటం వల్ల రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైళ్లు ఆగిపోయి, తీవ్రంగా ఆలస్యం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి రోడ్డు, శ్రీరాంనగర్, గద్వాల్, అలంపూర్ వెళ్లే ప్రయాణికులు ముఖ్యంగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


