News April 16, 2025
కొయ్యలగూడెం: పీహెచ్‌సీని ఆక్మసిక తనిఖీ చేసిన డైరెక్టర్

కొయ్యలగూడెం పీహెచ్‌సీని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ బి. సుబ్రమణ్యేశ్వరీ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులు పొందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలను ఆమె వైద్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి సమకూరిన పరికరాలను పరిశీలించారు.
Similar News
News November 22, 2025
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 44 పోస్టులు

CSIR-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 44 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 26వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.36,918-రూ.67,530 చెల్లిస్తారు. వెబ్సైట్: cdri.res.in
News November 22, 2025
సూర్యాపేట: ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ కృషి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డు జంక్షన్‌ను ఆయన ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాంతో కలిసి పరిశీలించారు. ప్రతి వాహనదారుడి భద్రత ముఖ్యమన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రజలు సైతం రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్పీ నరసింహ కోరారు.
News November 22, 2025
నిటారుగా ఉండే కొండ దారి ‘అళుదా మేడు’

అయ్యప్ప స్వాములు అళుదా నదిలో స్నానమాచరించిన తర్వాత ఓ నిటారైన కొండ ఎక్కుతారు. ఇది సుమారు 5KM ఉంటుంది. ఎత్తైన గుండ్రాళ్లతో కూడిన ఈ దారి యాత్రికులకు కఠినమైన పరీక్ష పెడుతుంది. పైగా ఇక్కడ తాగునీటి సౌకర్యం కూడా ఎక్కువగా ఉండదు. స్వామివారి నామస్మరణతో మాత్రమే ఈ నిట్టనిలువు దారిని అధిగమించగలరని నమ్ముతారు. ఈ మార్గాన్ని దాటితేనే యాత్రలో ముఖ్యమైన ఘట్టం పూర్తవుతుందట. <<-se>>#AyyappaMala<<>>


