News August 7, 2024
కొయ్యలగూడెం: భార్యను నరికి చంపిన భర్త

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో బుధవారం దారుణం జరిగింది. కొయ్యలగూడెం ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపిన వివరాల మేరకు.. రామానుజపురంలో సాయి లక్ష్మిని భర్త సూర్యచంద్రం వేటకొడవలితో కిరాతకంగా నరికి హత్య చేశాడు. భార్యపై అనుమానంతోనే దాడి చేసినట్లు భావిస్తున్నారు. సమాచారం తెలియడంతో హుటాహుటిన కొయ్యలగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News October 24, 2025
స్కూల్ పైనుంచి పడిన విద్యార్థిని పరిస్థితి విషమం

తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరుపాడులోని మాగంటి అన్నపూర్ణా దేవి బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కొమ్ము హాసిని బిల్డింగ్ పైనుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ ఆస్పత్రిలో బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉందని తండ్రి రవికుమార్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.
News October 24, 2025
తణుకు: నాగుల చవితికి తేగలు సిద్ధం

నాగులచవితి పురస్కరించుకొని మార్కెట్లో తేగలు అందుబాటులోకి వచ్చాయి. సహజసిద్ధంగా దొరికే తేగలు, బుర్ర గుంజు నాగులచవితి రోజున పుట్టలో వేస్తుంటారు. అప్పటినుంచి తేగలు తినడానికి మంచి రోజుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా విరివిగా దొరికే తేగలను మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. నాగుల చవితి రోజున వినియోగించడానికి ఒక్కో తేగను తణుకులో రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు.
News October 24, 2025
డీఎస్పీకి RRR కితాబివ్వడం సరికాదు: కొత్తపల్లి

డిప్యూటీ స్పీకర్ రఘురామ భీమవరం డీఎస్పీకి కితాబులిస్తూ మాట్లాడటం సరికాదని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. ‘ప.గో జిల్లాలో పేకాట సహజమంటూ RRR చెప్పడం వల్ల ఇక్కడి ప్రజలపై తప్పుడు భావన వెళ్లే ప్రమాదం ఉంది. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం హోదాలో విచారించి నివేదిక ఇవ్వమన్నారే తప్ప ముందస్తుగా చర్యలు తీసుకోమనలేదు. దీనిపై పవన్తో RRR నేరుగా మాట్లాడాల్సింది’ అని అన్నారు.


