News April 14, 2025

కొయ్యూరు మండలంలో గాలివాన బీభత్సం

image

కొయ్యూరు మండలంలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం పలకజీడి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని ఛిన్నాభిన్నం చేసింది. వసతి గృహంలో ఇనుప రాడ్స్ అన్నీ విరిగిపోయి, పైకప్పు మొత్తం ఎగిరి పోయిందని వార్డెన్ రాజేశ్వరి సోమవారం ఉదయం తెలిపారు. తనతో పాటు అక్కడే ఉన్న 20మంది విద్యార్థులు వేరే భవనంలోకి పరుగులు తీశామన్నారు.

Similar News

News January 22, 2026

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ మార్కెట్ రోడ్డులో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు సాగే ఈ వేడుకలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, కళ్యాణ మండపం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 22, 2026

పాన్ ఇండియా ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి: కలెక్టర్

image

బాలకార్మిక వ్యవస్థ నివారణలో భాగంగా ఈ నెల 26 నుంచి మార్చి 31వరకు పాన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్నీ శాఖలు సమష్టిగా కృషి చేయాలని, బాల్య వివాహాలు అరికట్టాలని స్పష్టం చేశారు.

News January 22, 2026

విజయనగరం జిల్లా ఎస్. కోటలో మెగా జాబ్‌మేళా

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, విజయనగరం జిల్లా ఎస్ కోట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జనవరి 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ అర్హత గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.inలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. 10 మల్టీ నేషనల్ కంపెనీలు 535 పోస్టులను భర్తీ చేయనున్నాయి.