News June 14, 2024
కొయ్యూరు: మనస్తాపంతో యువతి సూసైడ్
కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయతీ బొడ్డుమామిడి లంకకు చెందిన కుండ్ల రాధమ్మ(19)అనే యువతి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాధమ్మ చిన్నతనంలో తల్లి చనిపోయింది. ఆ తర్వాత సోదరుడు మృతి చెందాడు. తనను ఎంతో అపురూపంగా చూసుకునే నాన్నమ్మ ఇటీవలే చనిపోయింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రాధమ్మ గురువారం ఇంటి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంప ఎస్సై లోకేశ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 11, 2024
విశాఖలో వ్యభిచార గృహంపై దాడి
విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. మధురానగర్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో నిర్వాహకురాలితో పాటు ఒక బాధితురాలు విటుడు ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు.
News September 11, 2024
తెరుచుకున్న బొర్రా గుహలు
భారీ వర్షాల వల్ల అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసివేసిన బొర్రా గుహలను అధికారులు మంగళవారం తెరిచారు. అయితే మంగళవారం కేవలం 300 మంది పర్యాటకులు మాత్రమే బొర్రా గుహలను సందర్శించారని యూనిట్ మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు.
News September 11, 2024
విశాఖ-అరకులోయ బస్సుల పునరుద్ధరణ
భారీ వర్షాల కారణంగా విశాఖ నుంచి అరకులోయ రాకపోకలు సాగించే మూడు బస్సులను గత శనివారం నుంచి నాలుగు రోజుల పాటు రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో బుధవారం నుంచి ఈ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి మాడుగుల, పాడేరు వెళ్లాల్సిన సర్వీసులను చోడవరం వరకు మాత్రమే నడుపుతున్నారు. భారీ వర్షాల కారణంగా చోడవరం నుంచి మాడుగుల, పాడేరు రూట్లు బాగా పాడయ్యాయి.