News May 26, 2024
కొయ్యూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఉపాధి కోసం వలస వెళ్లిన వ్యక్తి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొయ్యూరు మండలంలోని బాలరేవుల గ్రామానికి చెందిన పిట్టల కామేశ్ ఉపాధి కోసం కత్తిపూడి ప్రాంతానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో కత్తిపూడి జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కామేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News October 22, 2025
విశాఖలో రూ.7,62,892 విలువ గల బాణసంచా సీజ్

విశాఖలో దీపావళి వేడుకల్లో 3 సంవత్సరాల కంటే చాలా తక్కవ వాయుకాలుష్యం నమోదు అయ్యింది. సీపీ ఆదేశాలతో పోలీసులు దాడులు జరిపి 39 కేసులు నమోదు చేసి, రూ.7,62,892 విలువ గల నకిలీ మందుగుండు సామగ్రి, లైసెన్స్ లేని బాణసంచా సామగ్రి సీజ్ చేశారు. ఈ సంవత్సరం దీపావళి తర్వాత, 3 మూడు సంవత్సరాల కంటే తక్కువగా నగరంలో వాయుకాలుష్యం నమోదు అయిందని విశాఖ పోలీసులు బుధవారం తెలిపారు.
News October 22, 2025
విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా సహాయకుల అరెస్ట్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇది వరకే క్రికెట్ బెట్టింగ్ కేసులో ముద్దాయిలను దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మరో నలుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. ‘exchange 666’ అనే బెట్టింగ్ యాప్తో బెట్టింగ్ చేస్తున్న రాంబిల్లికి చెందిన బంగార్రాజు, అచ్యుతాపురానికి చెందిన కొరుప్రోలు పూర్ణ కిశోర్, పరవాడకు చెందిన మేడిశెట్టి రాజు, విజయనగరానికి చెందిన గడిదేశి ఈశ్వరరావును అరెస్ట్ చేశారు.
News October 22, 2025
విద్యుత్ కనెక్షన్ల జారీ సరళతరం: CMD పృథ్వీతేజ్

కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియను సరళతరం చేశామని APEPDCL CMD పృథ్వీతేజ్ తెలిపారు. ఇకపై వినియోగదారులు ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఎస్టిమేట్ తయారీ అవసరం లేదన్నారు. 150 కిలోవాట్ వరకు ఫిక్స్డ్ కనెక్షన్ ఛార్జీలు ఉంటాయన్నారు. దరఖాస్తు సమయంలోనే వినియోగదారుడికి చెల్లించాల్సిన మొత్తం స్పష్టంగా తెలుస్తుందని దీంతో కనెక్షన్ జారీ వేగవంతమవుతుందన్నారు.