News February 21, 2025
కొయ్యూరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

కొయ్యూరు మండలంలోని పిట్టచలం గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ మీదు వెళ్తుండగా హైవేపై పక్కన ఉన్న గోతిలో అదుపు తప్పి పడ్డారు. గాయపడిన వారు తోటలూరుకి చెందిన వారిగా తెలిసింది. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. హైవే సిబ్బంది గోతులు తీసి నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
Similar News
News March 25, 2025
MLC Elections: ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయంటే..!

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (ఏప్రిల్ 23) 116 మంది (కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లు) తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారు. ఎంఐఎంకు 49 ఓట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 13 ఉన్నాయి. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు 54 మంది ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 59 ఓట్ల కంటే ఎక్కువ వస్తే వారే విజయం సాధిస్తారు. ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉంటారు.
News March 25, 2025
అరబ్ దేశంలో పోలవరం వాసి మృతి

పోలవరం మండల కేంద్రానికి చెందిన షేక్ యూసఫ్ మంగళవారం తెల్లవారుజామున అరబ్ దేశంలో గుండెపోటుకు గురై మరణించారు. ఎన్నో ఏళ్లుగా అరబ్ దేశంలో పనిచేస్తూన ఆయన స్వగ్రామానికి నెల రోజులక్రితం వచ్చి తిరిగి వెళ్లాడు. అందరితో అప్యాయంగా మెలిగేవాడని యూసఫ్ ఇక లేరనే మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 25, 2025
35ఏళ్ల తర్వాత సంతానం కష్టమే!

కెరీర్ గ్రోత్ అంటూ చాలా మంది మగవాళ్లు 30ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవట్లేదు. మరికొందరేమో సెటిల్ అయ్యాకే పిల్లలంటూ ప్లాన్ చేస్తుంటారు. అయితే, 35ఏళ్లు దాటితే వీర్యంలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుందని, వాటి ఆకారం మారిపోయి కదలికలు తగ్గుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘పిల్లలు పుట్టడానికి ముఖ్యమైన టెస్టోస్టెరాన్ 35ఏళ్ల నుంచి తగ్గుతూ ఉంటుంది. దీనికి పరిష్కారంగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.