News May 26, 2024
కొయ్యూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఉపాధి కోసం వలస వెళ్లిన వ్యక్తి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొయ్యూరు మండలంలోని బాలరేవుల గ్రామానికి చెందిన పిట్టల కామేశ్ ఉపాధి కోసం కత్తిపూడి ప్రాంతానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో కత్తిపూడి జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కామేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News February 18, 2025
విశాఖ: రెండు రైళ్లు రద్దు

కార్యాచరణ పరిమితుల కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేయనున్నట్లు రైల్వే శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేసుకోవాలని సూచించింది. రానుపోను రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ✔ ఫిబ్రవరి 21న సంత్రాగచ్చి-ఎంజీఆర్ చెన్నై ఎక్స్‌ప్రెస్ (22807)✔ ఫిబ్రవరి 18న షాలిమర్-విశాఖ ఎక్స్ ప్రెస్(22853) రద్దు చేశారు.
News February 18, 2025
విశాఖకు చేరుకున్న ఎమ్మెల్సీ బ్యాలెట్ పత్రాలు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బ్యాలెట్ పత్రాలు విశాఖ జిల్లాకు సోమవారం చేరుకున్నాయి. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్యర్థుల ఫోటోలు, ఇతర వివరాలతో కూడిన నివేదికలను స్థానిక అధికారులు ఇప్పటికే పంపించారు. సంబంధిత బ్యాలెట్ పత్రాలను కర్నూలులో ప్రింటింగ్ చేశారు. ఈ పత్రాలు విశాఖకు సోమవారం చేరుకున్నాయి.
News February 18, 2025
కావ్యరచనకు ఆధ్యుడు వాల్మీకి మహర్షి: చాగంటి

వాల్మీకి మహర్షి కావ్యరచనకు ఆధ్యుడని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విశాఖ మధురవాడ గాయత్రీ కళాశాల వేదికగా నిర్వహిస్తున్న శ్రీమద్రామాయణం ఉపన్యాసాన్ని ఆయన సోమవారం కొనసాగించారు. ఈ సందర్భంగా కావ్యాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేయడం వాల్మీకి మహర్షికే సాధ్యమన్నారు. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలని రామాయణంలో స్వామి హనుమ వివరించి తెలిపారని పేర్కొన్నారు. తర్వాత చేస్తే ప్రయోజనం శూన్యమన్నారు.