News June 12, 2024

కొరిశపాడు: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

image

కొరిశపాడు మండలం రాచపూడిలో అగ్రహారానికి చెందిన పీక రాజేశ్ అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో సీఐ శివరామకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు బేల్దారి మేస్త్రిగా పనిచేస్తూ ఉంటాడని గుర్తించారు. మృతదేహాన్ని అద్దంకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానస్పద కేసుగా నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

Similar News

News October 27, 2025

నేటి కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు

image

మొంథా తుఫాన్ దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమానికి రావద్దని కలెక్టర్ సూచించారు.

News October 26, 2025

ప్రకాశం: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రి

image

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాలయముడిలా కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన కొండపి మండలంలో జరిగింది. తండ్రి మద్యం మత్తులో 12 ఏళ్ల కుమార్తెపై కొద్దిరోజుల క్రితం అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లి వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించగా ఈ విషయం తేలింది. దీంతో తల్లి బాలికను ఆరా తీయగా కన్నతండ్రే కాలయముడయ్యాడని తెలిపింది. కాగా కొండపి PSలో పోక్సో కేసు నమోదైంది.

News October 26, 2025

రేపు ఎస్పీ మీకోసం కార్యక్రమం రద్దు

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో 27న నిర్వహించవలసిన PGRS కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు వంకలు దాటే సమయంలో జాగ్రత్త వహించాలన్నారు.